జాబ్ పేరుతో హోటల్‌కు తీసుకువెళ్లి మహిళపై లైంగిక దాడి!

లక్నో : జాబ్ పేరుతో ఆశలు రేపి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడు నేరాన్ని కెమెరాలో రికార్డు చేయడంతో పాటు పోలీసులకు చెబితే క్లిప్‌ను వైరల్ చేస్తానని బాధితురాలిని బెదిరించాడు. మీరట్ జిల్లాలోని ఖర్కోడా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళ ఫిబ్రవరి 15న వ్యక్తి వద్దకు తీసుకువెళ్లిందని, అతడు తనను హోటల్‌కు తీసుకువెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు.
ఈ దారుణాన్ని మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన నిందితుడు పోలీసులకు చెబితే వీడియోను బహిర్గతం చేస్తానని బెదిరించాడని చెప్పారు. స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, ఫిర్యాదును స్వీకరించలేదని పేర్కొన్నారు. పోలీసుల తీరుతో విసుగుచెంది సీఎం పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో అధికారుల్లో చలనం వచ్చింది. మరోవైపు ఈ విషయం తమ దృష్టికి రాలేదని స్ధానిక పోలీస్ అధికారి సంజయ్ శర్మ పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం నిందితులపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abused
- Crime news
- job
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

