ప్రియుడి సమస్య పరిష్కారం కోసం… అతడి రెండో భార్యను హత్య చేసిన ప్రియురాలు
భోపాల్: ప్రియుడి సమస్య పరిష్కారం కోసం, అతడి రెండో భార్యను ప్రియురాలు హత్య చేసింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బబ్లూ అనే వ్యక్తికి 14 ఏళ్ల కిందట నీలం అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. అయితే ఈ ఏడాది మే నెలలో రాణి అనే మహిళను అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో ఆ దంపతుల మధ్య సమస్యలు మొదలయ్యాయి.
మరోవైపు జ్యుయలరీ షాపులో పని చేసే రీతూ గౌర్ అనే వివాహితతో కూడా బబ్లూకు సంబంధం ఉంది. ఆరేళ్ల కిందట జ్యుయలరీ షాపులో కొనుగోలు సందర్భంగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఏడేళ్ల కుమార్తె కూడా ఉన్న ఆమె ఇంటికి బబ్లూ తరచుగా వెళ్లేవాడు. రెండో భార్య వల్ల కుటుంబంలో తలెత్తిన సమస్యను ఇటీవల రీతూ వద్ద ప్రస్తావించాడు. ఆమెను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానంటూ వాపోయాడు.
కాగా, ప్రియుడు బబ్లూను ఓదార్చిన ప్రియురాలు రీతూ, అతడి రెండో భార్య రాణి అడ్డుతొలగిస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలో మరో మహిళతో కలిసి జాకెట్ కుట్టించుకునే నెపంతో రాణి ఇంటికి వెళ్లింది. ఆమె గొంతునులిమి హత్య చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఇంటికి వచ్చిన బబ్లూ, మరణించిన రెండో భార్య రాణిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె ఉన్నట్టుండి అస్వస్థతకు గురైందని చెప్పాడు.
అయితే గొంతు నొక్కి ఆమెను హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. బబ్లూను పోలీసులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. దీంతో అతడితోపాటు ప్రియురాలు రీతూ, ఆమెకు సహకరించిన మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

