భర్త ముందే భార్యపై ముగ్గురు సామూహిక లైంగికదాడి

లక్నో: భర్త ముందే భార్యపై ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంతేగాక ఈ వికృతచేష్టను తమ మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులు, బంగారం దోచుకుని పారిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఎట్మాద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక యువతి భర్తతో కలిసి బైక్‌పై సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఎట్మౌడౌలా ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తున్నది.
మార్గమధ్యలో ముగ్గురు వ్యక్తులు వారి బైక్‌ను అడ్డగించి నిలువరించారు. ఆ దంపతులపై దాడి చేసి వారిని బలవంతంగా సమీపంలోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భర్తను కొట్టి అతడి ఎదుటే భార్యపై ఆ ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ చర్యను తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం వారి వద్ద రూ.10,000 నగదు, మహిళ చెవి రింగులు, ఇతర వస్తువులు తీసుకొని పారిపోయారు.
జరిగిన దారుణంపై భార్యాభర్తలు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. ఫిర్యాదు వివరాల ప్రకారం ఇద్దరు వ్యక్తులతోపాటు గుర్తు తెలియని మరొకరిపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ఒక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

