ముంబై : నగరంలోని శాంతాక్రజ్ ప్రాంతంలో ఓ హోటల్లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న మహిళను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోడల్, టీవీ నటితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు నటిని కాపాడారు.
సెక్స్ రాకెట్‌పై సమాచారం అందుకున్న పోలీసులు కస్టమర్ల పేరుతో మహిళను సంప్రదించారు. దీంతో మహిళ శాంతాక్రజ్‌లోని స్టార్ హోటల్‌కు రావాలని వారిని కోరింది. కస్టమర్‌గా నమ్మబలికిన పోలీస్ హోటల్‌కు వెళ్లగా రూ లక్ష ఇవ్వాలని కోరింది. ఆపై మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె చెర నుంచి టీవీ నటి, మోడల్‌తో పాటు మరో బాధితురాలిని రక్షించారు. మహిళ ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.