e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home News దారుణం : పార్న్ స్టార్‌గా మారాల‌ని భార్య‌కు వేధింపులు

దారుణం : పార్న్ స్టార్‌గా మారాల‌ని భార్య‌కు వేధింపులు

ముంబై : భార్య‌ను పార్న్ స్టార్‌గా మారాల‌ని భ‌ర్త ఒత్తిడి తీసుకురావ‌డంతో పాటు ఆమె ప్రైవేట్ భాగాల్లో వ‌స్తువును చొప్పించి తీవ్ర వేధింపుల‌కు గురిచేసిన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో వెల‌గుచూసింది. ఫిజియోథెరిపిస్టుగా ప‌నిచేసే మ‌హిళ (29) 2014లో నిందితుడిని వివాహం చేసుకుంది. వీరికి ఇప్ప‌టివ‌ర‌కూ పిల్ల‌లు లేరు. సంతానం క‌ల‌గ‌లేద‌ని కూడా మ‌హిళను అత్తింటివారు వేధించార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అశ్లీల వీడియోల‌కు బానిసైన నిందితుడు భార్య‌ను పార్న్ స్టార్‌గా మారాల‌ని ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్ర‌మంలో రాత్రి వేళ ఆమె నిద్రిస్తుండ‌గా గుర్తుతెలియ‌ని వ్య‌క్తికి వీడియో కాల్ ద్వారా లైవ్ స్ట్రీమిగ్ చేశాడు. భ‌ర్త ఆగ‌డాలు భ‌రించ‌లేని మ‌హిళ ఖ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింది. మ‌హిళ కుటుంబ స‌భ్యులు ఆమెను తిరిగి మెట్టినింటికి పంప‌మ‌ని చెప్ప‌డంతో ట్రిపుల్ త‌లాక్‌తో తెగ‌తెంపులు చేసుకోవాల‌ని నిందితుడి కుటుంబ స‌భ్యులు కోరుతున్నార‌ని బాధితురాలు వెల్ల‌డించారు.

- Advertisement -

ఆమె డాక్యుమెంట్లు, పాస్‌పోర్ట్ స‌హా ఇత‌ర వ‌స్తువులు, ప‌త్రాల‌ను ఇవ్వ‌కుండా వేధిస్తున్నార‌ని తెలిపారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేశామ‌ని, అత‌డి మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఫోరెన్సిక్ ప‌రీక్ష‌కు పంపామ‌ని పోలీసులు చెప్పారు. నిందితుడిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement