గే యాప్‌లో భర్త ప్రొఫైల్ : విడాకులు కోరిన భార్య

బెంగళూర్ : భర్త ప్రొఫైల్ గే డేటింగ్ యాప్స్‌లో కంటపడటంతో బెంగళూర్‌కు చెందిన మహిళా టెకీ (28) అతడితో తెగతెంపులకు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై మహిళా హెల్ప్‌లైన్‌కు, బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ భర్త నుంచి విడాకులు కోరింది. జంటకు సర్ధిచెప్పేందుకు కౌన్సెలింగ్ నిర్వహించినా మహిళ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసేందుకు మొగ్గుచూపింది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే మహిళకు 2018 జూన్‌లో బ్యాంకులో పనిచేసే 31 ఏండ్ల వ్యక్తితో వివాహమైంది.
ఆమె భర్తకు ఇది రెండో వివాహం కాగా భర్త తన వికృతమైన కోర్కెలను దాచి తనను మోసం చేశాడని మహిళ ఆరోపించారు. కాగా, పెండ్లయిన తర్వాత భర్త ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. తనను ఎందుకు దూరం పెడుతున్నావని ఆమె అడగ్గా మొదటి భార్య తనను మోసం చేయడంతో ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని బుకాయించేవాడు. తన బలహీనతలు కప్పిపుచ్చుకునేందుకు తాము కోరిన మొత్తం కట్నంగా తీసుకురాలేదని భార్యపై చిర్రబుర్రులాడేవాడు.
లాక్డౌన్ సందర్భంగా భర్త ఫోన్‌ను చెక్ చేయడంతో అతడి బండారం బయటపడింది. గే డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్‌ను ఓపెన్ చేసి పలువురితో చాట్ చేసేవాడని వెల్లడైంది. లాక్డౌన్ నియంత్రణలు ఎత్తివేయగానే భర్త వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ అతడితో విడాకుల కోసం కోర్టు తలుపుతట్టేందుకు సిద్ధమైంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Bangalore
- cheating case
- divorce
- gay
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

