భార్యకు నిప్పు పెట్టి ఆపై హైవేపై పడేసి..

లక్నో : యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళ కాలిన గాయాలతో హైవేపై పడిఉండటం మంగళవారం ఉదయం జలౌన్ జిల్లా ఒరై ప్రాంతంలో కలకలం రేపింది. మహిళ (23)ను దయనీయ స్థితిలో చూసిన స్ధానికులు ఆమెను ఝాన్సీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు నెలల కిందట మహిళ ఓ యువకుడిని మతాంతర వివాహం చేసుకుంది. భర్త తనను సజీవ దహనం చేసేందుకు తనకు నిప్పుపెట్టాడని బాధితురాలు ఆరోపించారు.
నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలిని ఝాన్సీ జిల్లాలోని సెసా గ్రామానికి చెందిన ఉమగా గుర్తించారు. ఒరై ప్రాంతంలోని బజరియాకు చెందిన అరిఫ్ అనే వ్యక్తిని బాధితురాలు వివాహం చేసుకున్నారని, ఆపై భర్తతో కలిసి ఆమె నివసిస్తోందని ఏఎస్పీ రాకేష్ సింగ్ తెలిపారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడికాలేదని భర్తే తనకు నిప్పంటించాడని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ను నమోదు చేశామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

