పరిగి టౌన్ : పెళ్లి పేరుతో అమాయక మాటలు చెప్పి అమ్మాయిని మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని చిట్యాల్ గ్రామానికి చెందిన ముక్తాల మహేందర్ అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించాడు. పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మోసగించిన యువకున్ని రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు.