లాకప్ రూంలో పార్టీ చేసుకున్న గ్యాంగ్స్టర్స్ !

న్యూఢిల్లీ : లాకప్ గదిలోనే ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ఎంచక్కా మద్యం సేవిస్తూ స్నాక్స్ ఆరగిస్తున్న వీడియో సోషల్ మీడియా వేదికలపై తెగ వైరలవుతోంది. ఢిల్లీలోని జైలులో ఈ ఘటన జరగ్గా వీడియోను పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. హత్యలు, దోపిడీ కేసులో అరెస్టయి తీహార్‌లోని మందోలి జైలులో ఉన్న ఇద్దరు గ్యాంగ్స్టర్లను రాహుల్ కాలా, నవీన్ బాలి అని గుర్తించారు. వీరు జైలు లోపలి నుంచే ప్రత్యర్ధి గ్యాంగ్‌కు చెందిన సభ్యుడుని హత్య చేసేందుకు కుట్ర పన్నారని వీరిద్దరినీ పోలీసులు ఇటీవల మరోసారి అరెస్ట్ చేశారు.
వీరిని లోధి కాలనీ స్పెషల్ పోలీస్ సెల్ యూనిట్ బృందం విచారణ కోసం వీరిద్దరినీ గత వారం రోజులుగా తమ కస్టడీలోకి తీసుకుని లాకప్‌లో ఉంచింది. ఆగస్ట్ 10 వరకూ స్పెషల్ సెల్ కస్టడీలో ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌ను ఆ తర్వాత తరిగి మండోలి జైలుకు పంపారు. అయితే ఈ ఘటన స్పెషల్ సెల్ లాకప్‌లో జరిగిందా లేక మండోలి జైలులో గ్యాంగ్స్టర్స్ పార్టీ చేసుకున్నారా అనేది తెలియరాలేదు. ఇక ఈ వీడియోలో గ్యాంగ్‌స్టర్స్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తూ, స్నాక్స్ తీసుకోవడమే కాక ఎంచక్కా స్మోక్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
వీరిలో మరో వ్యక్తి మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ వీడియో హై సెక్యూరిటీ లాకప్స్లోనూ భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఈ రెండు జైళ్లలో అత్యంత పటిష్టమైన బందోబస్తు ఉంటుంది. ప్రతి లాకప్ రూం వెలుపల గార్డుల పహారా ఉంటుంది. లాకప్ రూంలు, జైళ్లలో నేరగాళ్లకు వీఐపీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోతో మరోసారి బట్టబయలైంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

