మాజీ ప్రియురాలిని ఇరికించేందుకు బిడ్డను చంపేశాడు..
Daughter Killed | మాజీ ప్రియురాలిని, ఆమె సోదరుడిని ఇరికించేందుకు ఓ వ్యక్తి తన బిడ్డను చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని ధౌరా గ్రామంలో చోటు చేసుకుంది. బాబ్లూ ప్రజాపతికి 13 ఏండ్ల కూతురు ఉంది. అయితే

లక్నో : మాజీ ప్రియురాలిని, ఆమె సోదరుడిని ఇరికించేందుకు ఓ వ్యక్తి తన బిడ్డను చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని ధౌరా గ్రామంలో చోటు చేసుకుంది. బాబ్లూ ప్రజాపతికి 13 ఏండ్ల కూతురు ఉంది. అయితే అతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దశాబ్ద కాలం పాటు వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగింది. ఇటీవల కాలంలో ఆమె బాబ్లూకు దూరమైంది. ఆమె సోదరుడికి ఇచ్చిన రూ. 30 వేలు కూడా తిరిగి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఆమెతో పాటు అతనిపై కూడా బాబ్లూ పగ పెంచుకున్నాడు. వారిని ఎలాగైనా జైలు పాలు చేయాలని నిశ్చయించుకున్నాడు బాబ్లూ.
దీంతో తన 13 ఏండ్ల కుమార్తె మాయను బాబ్లూ గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం పోలీసులకు వద్దకు వెళ్లి.. తన బిడ్డను 9 మంది కలిసి హత్య చేశారని, ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారని బాబ్లూ తెలిపాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాబ్లూ పైనే అనుమానం
దర్యాప్తులో భాగంగా బాబ్లూను పోలీసులు అనేకసార్లు ప్రశ్నించారు. అతను చెప్పే మాటలకు పొంతన లేకపోవడంతో గట్టిగా ప్రశ్నించారు. దీంతో తానే మాయను హత్య చేశానని అంగీకరించాడు. తనకు దూరమైన మాజీ ప్రియురాలిని, ఆమె సోదరుడిని జైలు పాలు చేసేందుకే ఈ కుట్ర చేశానని బాబ్లూ తెలిపాడు. దీంతో బాబ్లూను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

