Andhra Pradesh | టమాటాల కోసం.. పొలంలో నిద్రిస్తున్న రైతును చంపేశారు..
Andhra Pradesh | అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మరో టమాటా రైతును చంపేశారు. ఏడు రోజుల్లో ఇది రెండో ఘటన.
Andhra Pradesh | అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మరో టమాటా రైతును చంపేశారు. ఏడు రోజుల్లో ఇది రెండో ఘటన.
వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లాలోని పెద్ద తిప్పసముద్రం గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి అనే రైతు తన పొలంలో టమాటా పంట వేశాడు. ప్రస్తుతం టమాటా ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. వాటిని కాపాడుకునేందుకు రైతు రాత్రింబవళ్లు పొలం వద్దే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి కూడా మధుకర్ రెడ్డి తన టమాటా పంటకు కాపలాగా ఉన్నాడు. రైతు నిద్రిస్తున్న సమయంలో అతన్ని గుర్తు తెలియని దుండగులు చంపేశారు. అనంతరం టమాటాలను తీసుకెళ్లారు దుండగులు.
సోమవారం పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు.. మధుకర్ రెడ్డి డెడ్ బాడీని చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రైతు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వారం రోజుల క్రితం ఇదే అన్నమయ్య జిల్లాలోని బోడుమల్లదిన్నే గ్రామంలో 62 ఏండ్ల రైతును టమాటాల కోసం చంపిన విషయం తెలిసిందే. ఆ రైతును నరేం రాజశేఖర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

