Cheated get married | పెళ్లి చేసుకుంటా నని మోసం చేసిన పరిశోధక విద్యార్థి..కేసు నమోదు చేసిన పోలీసులు

ఉస్మానియా యూనివర్సిటీ : పీజీ చదువుతున్న విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నెలరోజుల ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్న ఒక విద్యార్థిని గతేడాది ఏప్రిల్‌లో తన ప్రాజెక్టు నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ జెనిటిక్స్ విభాగంలోని ప్రయోగశాలకు వచ్చింది. బాధితురాలికి అక్కడే పరిశోధనలు చేసుకుంటున్న కౌశిక్ (33) పరిచయమయ్యాడు.
ఆమెకు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రయోగశాలలోనే ఆమెపై లైంగికదాడి చేశాడు. ఉన్నత చదువులు చదువుతున్నాడనే ఉద్దేశంతో అతడిని పూర్తిగా విశ్వసించిన అమ్మాయి పెళ్లి విషయం అడిగేసరికి ముఖం చాటేశాడు. బాధితురాలిని దూరం పెట్టడం ప్రారంభించాడు.
నిలదీసేసరికి తన తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించడం లేదంటూ స్పష్టం చేశాడు. వాళ్లు చనిపోతామని బెదిరిస్తున్నా రని చెప్పి చేతులు దులుపుకున్నాడు. అప్పటికే విషయం అర్థమైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గత నెల 3న ఓయూ పోలీసులు కౌశిక్‌పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

