పెళ్లికి డబ్బుల కోసం… దొంగలుగా మారిన టెకీ జంట
చెన్నై: పెళ్లి చేసుకునేందుకు డబ్బుల కోసం టెకీ జంట దొంగలుగా మారారు. చోరీకి ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల దినేష్ కుమార్, 24 ఏళ్ల సేన్బగవల్లి అలియాస్ ప్రియా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు. టెకీలైన వీరిద్దరికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెళ్లి ఖర్చుల కోసం దొంగలుగా మారారు.
ఈ నెల 12న సాయంత్రం వేళ వాడవల్లి సమీపంలోని బొమ్మనంపాళయం గ్రామంలో నివాసం ఉంటున్న 76 ఏళ్ల ఆర్ పెరియ రాయప్పన్ ఇంటికి వెళ్లారు. దాహం వేస్తున్నదని తాగేందుకు మంచి నీరు అడిగారు. ఒక్కడే ఇంట్లో ఉన్నట్లు గ్రహించారు. ఆయన వెనుకే ఇంట్లోకి వెళ్లారు. ఆ వృద్ధుడ్ని కొట్టి తాడుతో కట్టేశారు. ఆ ఇంట్లో ఉన్న 18 గ్రాముల బంగారం, రూ.1,500 నగదు దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.
కాగా, అంతలో రాయప్పన్ పెద్ద కుమారుడు బాబు ఆ ఇంటికి వచ్చాడు. దినేష్ కుమార్, ప్రియా అక్కడి నుంచి పారిపోవడం చూసి కేకలు వేశాడు. దీంతో అప్రమత్తమైన పొరుగువారు వారిద్దరినీ పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు దినేష్, ప్రియా ఈ నెల 4న కూడా ఇదే తరహాలో దొంగతనానికి పాల్పడినట్లు వాడవల్లి పోలీసులు తెలిపారు. ములై నగర్ సమీపంలో ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి నుంచి రూ.28,000 నగదు, మొబైల్ ఫోన్ను చోరీ చేసినట్లు చెప్పారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లైన ఇద్దరికీ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడిందని, దీంతో పెళ్లికి డబ్బుల కోసం వారిద్దరూ కలిసి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

