యాదాద్రి భువనగిరి : ఆలేరు మున్సిపల్ కమిషనర్ లావణ్య లతను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ మున్సిపల్ కనీస చట్టాలపై అవగాహన లేకపోవడం, విధుల నిర్వహణలో అలసత్వం వహించినందుకు, సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పలుమార్లు హెచ్చరించినప్పటికి మార్పు రాకపోవడంతో.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తీవారి సమర్పించిన నివేదిక మేరకు కలెక్టర్ సస్పెండ్ చేశారు.