Delhi | ఢిల్లీలో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు.. వ్యక్తి మృతి
Delhi | న్యూఢిల్లీ : ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతీ బాగ్ ఫ్లై ఓవర్ వద్ద వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది.
Delhi | న్యూఢిల్లీ : ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతీ బాగ్ ఫ్లై ఓవర్ వద్ద వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధిత వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. మోతీ బాగ్ ఫ్లై ఓవర్ సమీపంలో ఉన్న ఓ మెడికల్ షాపులు మందులు కొనుగోలు చేసేందుకు గుప్తా(36) అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున బయటకు వచ్చాడు. మెడిసిన్స్ తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న ఆ వ్యక్తిని బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేవలం బాధితుడు ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ లేకపోవడంతో.. ఆ వాహనం నంబర్ ఆధారంగా సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాద సమయంలో కారును డ్రైవింగ్ చేసింది మహిళ అని తేలింది. అశోక్ విహార్‌కు చెందిన ఆమె గ్రేటర్ కైలాష్‌లో ఓ పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అని పేర్కొన్నారు. ఈ మహిళపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం బసాయి దరపూర్లో నివసిస్తోంది. తన భర్త మృతికి కారణమైన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని గుప్తా భార్య పోలీసులను కోరింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

