Cylinder Blast | హర్యానా రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పానీపట్లోని బిచ్పరి గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అబ్దుల్ కరీమ్ (45), అతని భార్య అఫ్రోజ్ (40), కుమార్తెలు ఇశ్రట్ (20), రేష్మా (17), కుమారులు అబ్దుష్ (12), అఫన్ (10) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.