మూడు వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రేషన్ బియ్యం పట్టివేత | లారీలో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి బియ్యం సీజ్ చేశామన్నారు.

జహీరాబాద్/సంగారెడ్డి : భారీగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొందరు స్మగ్లర్లు గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తుండగా అరెస్ట్ చేశామని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసిల్దార్ షఫీయోద్దిన్ చిరాక్ పల్లి ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. వారి కథనం ప్రకారం. జహీరాబాద్ మండలంలోని చిరాక్‌పల్లి సమీపంలో మాడ్గి చౌరస్తా వద్ద లారీలో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి బియ్యం సీజ్ చేశామన్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ అర్చన రావణుని పై కేసు నమోదు చేశామన్నారు.
కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ కు చెందిన పూజారి కిరణ్ కుమార్ రేషన్ బియ్యం తరలిస్తున్నారని తమ విచారణలో తేలిందన్నారు. పూజారి కిరణ్ కుమార్ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని కోఈర్ మండలం లోని దిగ్వాల్ పౌరసరఫరాల గోదాంలో నిల్వ చేశామన్నారు. ఈ దాడుల్లో పౌరసరఫరాల అధికారులు సురేష్ కుమార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

