ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి
ఎర్రవల్లి : జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని గోశాల వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. డీసీఎంను ఓవర్ టేక్ చేయబోయిన బైక్ అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఇటిక్యాల ఎస్ఐ గోకారి తన బృందంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.

మృతులను ఐజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిగా, ఐజ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన చంద్రకళగా పోలీసులు గుర్తించారు. గాయపడిన మరో మహిళను తనగల గ్రామానికి చెందిన మంజులగా గుర్తించారు. గద్వాలలోని శుభకర హాస్పిటల్లో చంద్రకళ ఏఎన్ఎంగా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనం నంబర్ – AP 21 AB 2579.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

