మైనర్ హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
మైనర్ హత్యాచారం | మైనర్ హత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. నిందితుడిని ధరమ్ సోత్

మహబూబాబాద్ : మైనర్ హత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. నిందితుడిని ధరమ్ సోత్ రాజేశ్(22)గా గుర్తించారు. రాజేశ్‌ను మరిపెడ మండలం ధర్మారం తండాకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి ఒక బైక్ (TS 28 F 1320), సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిన్న సీతారాంపురం తండా సమీపంలోని మొండికట్ట గుట్టలో ఓ గిరిజన బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మరిపెడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 24 గంటల్లోపే నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాలికది, నిందితుడిది వేర్వేరు తండాలు అయినప్పటికీ, వీరిద్దరి మధ్య మూడు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచి ఇద్దదూ ఫోన్లో మాట్లాడుకుంటూ చనువుగా ఉంటున్నారు. అయితే బాలిక తన పెదనాన్న వద్దే ఉంటుంది. వీరికి స్థానికంగా ఉన్న ఈసర్ పెట్రోల్ బంకు వద్ద కిరాణం కొట్టు ఉంది. అక్కడికి బాలిక వచ్చినప్పుడల్లా ఆమెతో రాజేశ్ మాట్లాడుతుండేవారు. ఈ క్రమంలో ఒంటరిగా కలుద్దామని మైనర్‌ను అతను అడిగాడు. అయితే బాలిక బంధువుల్లో ఒకరు అనారోగ్యం బారిన పడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. దీంతో రాజేశ్‌కు ఫోన్ చేసి.. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానని చెప్పింది.
ఇదే అదునుగా భావించిన అతను.. ఇంట్లో ఎవరూ లేరు కదా.. బయట కలుద్దామని చెప్పాడు. ఇక ఆమె మొండికట్ట గుట్ట వద్దకు వచ్చింది. ఇద్దరూ కలిసి గుట్టపై ఉన్న బండరాయి మీద కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత శారీరకంగా కలుద్దామని రాజేశ్ ప్రతిపాదించగా, భయమేస్తుందని మైనర్ చెప్పింది. దీంతో ఇరువురి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. బాలిక తల బండరాయికి కొట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. అయినప్పటికీ అతను అదేమీ పట్టించుకోకుండా మృగంలా అత్యాచారం చేసి పైశాచిక ఆనందం పొందాడు. బాలిక స్పృహ తప్పిపడిపోయింది.
ఆ తర్వాత రాజేశ్ ఇదే విషయాన్ని శ్రీను అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. శ్రీను బాలిక బావ శంకర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తక్షణమే శ్రీను, శంకర్ కలిసి బైక్‌పై ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావమైన బాలికను పురుషోత్తమాయగూడెంలో ఆర్ఎంపీ కళాధర్ వద్దకు తీసుకుని వెళ్లారు. అప్పటికే బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్ఎంపీ నిర్ధారించాడు. ఈ కేసులో పక్కా సమాచారం మేరకు నిందితుడిని ఎల్లారిగూడెం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

