గర్భిణీని కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారం

పాట్నా: గర్భిణీని కిడ్నాప్ చేసిన ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ దారుణం జరిగింది. 21 ఏండ్ల మహిళ ఆరు నెలల గర్భవతి. శనివారం రాత్రి భోజనం తర్వాత నడక కోసం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. కాగా, నడక కోసం బయటకు వెళ్లిన గర్భిణీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమె కోసం వెతికారు.
మరోవైపు అత్యాచారం తర్వాత తనను లోకల్ ట్రైన్ ఎక్కించాలని బాధిత మహిళ నిందితులను ప్రాధేయపడింది. దీంతో ఆదివారం ఉదయం 4 గంటలకు ఇద్దరు ఆమెను పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌ను తీసుకువచ్చారు. ఒక వ్యక్తి టికెట్ తీసుకునేందుకు వెళ్లగా ఆ మహిళ ఏడుస్తుంటాన్ని రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఆమె వద్దకు రాగా, జరిగిన విషయాన్ని బాధితురాలు చెప్పింది. దీంతో రైల్వే స్టేషన్లో ఉన్న ఇద్దరు నిందితులు అంకిత్ కుమార్ (19), విశాల్ కుమార్ (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు శ్యామ్ కుమార్ కోసం గాలిస్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదుతో మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ముగ్గురు నిందితులు బాధిత మహిళ ఉండే కాలనీకి చెందిన వారేనని, వారు కూలీ పనులు చేస్తుంటారని మహిళా పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారిణి తెలిపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకుంటామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

