బాబాలుగా చెప్పుకుంటూ వ్యాపారికి టోకరా : ఇద్దరు నిందితుల అరెస్ట్
తమ అతీంద్రియ శక్తులతో సమస్యలు పారదోలుతామని తమకు తాము బాబాలుగా చెప్పుకుని ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను 29 ఏండ్ల వయసున్న ఢిల్లీకి చెందిన షహిల్, రఫీక్లుగా గుర్తించారు.
న్యూఢిల్లీ : తమ అతీంద్రియ శక్తులతో సమస్యలు పారదోలుతామని తమకు తాము బాబాలుగా చెప్పుకుని ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను 29 ఏండ్ల వయసున్న ఢిల్లీకి చెందిన షహిల్, రఫీక్లుగా గుర్తించారు. గతంలో వీధుల్లో ఇంద్రజాలం ప్రదర్శిస్తూ పొట్టపోసుకున్న వీరు అధిక మొత్తం సంపాదించాలనే ఆశతో బాబాలుగా అవతారమెత్తారు. వీరిద్దరూ ఇటీవల వ్యాపార నిమిత్తం రాజస్ధాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యాపారి ఆయన స్నేహితులు ఇద్దరిని మోసగించారు.
మార్చి 31న వ్యాపారి ఆయన స్నేహితులు ట్యాంక్ రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చారు. నిందితుల్లో ఒకరు వీరితో సంభాషణ సాగించారు. వ్యాపారంలో విజయవంతమయ్యేలా తాను సహకరిస్తానని నమ్మబలికాడు. ఆపై మరో నిందితుడు వారిని చేరుకుని బాబాగా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి వారికి మేజికల్ స్టోన్‌ను ఇచ్చారు. తాము చెప్పినవి పాటిస్తే అది సిల్వర్ స్టోన్‌గా మారుతుందని మభ్యపెట్టారు.
మరో మేజికల్ స్టోన్‌ను వారికి అప్పగించడంతో బాధితులు బాబాకు రూ 75,000 ఇచ్చారు. ఆపై ఈ రాళ్లను వెనక్కితిరిగి చూడకుండా దూరంగా పడేయాలని కోరారు. వారు చెప్పినట్టే రాయిని పడేసేందుకు వారు వెనుతిరిగిన మరుక్షణం నిందితులు ఇద్దరూ పరారయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని లూటీ సొమ్మును ఫిర్యాదుదారులకు అందచేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

