కన్యత్వ పరీక్షలో వధువు విఫలం… రూ.10 లక్షల జరిమానా విధింఫు
జైపూర్: కన్యత్వ పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో పంచాయతీ నిర్వహించి ఆమెకు రూ.10 లక్షల జరిమానా విధించారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది మే 11న భిల్వారా నగరానికి చెందిన 24 ఏళ్ల యువతికి బాగోర్‌కు చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఆ సమాజం ఆచరించే ‘కుక్డి’ విధానంలో నిర్వహించిన కన్యత్వ పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో అత్తింటివారు ఆమెను నిలదీశారు. అయితే పొరుగున నివసించే ఒక వ్యక్తి పెళ్లికి ముందు తనపై అత్యాచారం చేసినట్లు వధువు చెప్పింది. దీంతో భర్త, అత్తమామలు ఆమెను కొట్టారు. అనంతరం ఆ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అయితే లైంగిక దాడిపై మే 18న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వధువు తల్లిదండ్రులు తెలిపారు.
మరోవైపు మే 31న ఆ గ్రామంలో మరోసారి పంచాయతీ నిర్వహించారు. పరిహారం పేరుతో వధువు, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా విధించారు. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువుతోపాటు ఆమె కుటుంబాన్ని అత్తింటి వారు వేధించారు. నూతన వధువును ఆమె పుట్టింటికి పంపారు.
వధువు కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. వారి చెప్పింది నిజమని తేలడంతో వధువు భర్త, మామపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి అయూబ్ ఖాన్ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

