మగబిడ్డ కోసం ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు!

ముంబై : మగబిడ్డ కావాలనే కోరికతో భర్త తనకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడని ముంబైకి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తనకు 1500 స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇచ్చారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి తండ్రి రిటైర్డ్ జడ్జి 2007లో తన కుమార్తెకు ఉన్నత విద్య చదివి, సమాజంలో ప్రతిష్ట కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇక బాధితురాలి భర్త, అత్త న్యాయవాదులు కాగా, వదిన వైద్యురాలు కావడం గమనార్హం. పెండ్లయిన కొన్నేండ్ల తర్వాత నుంచి నిందితుడు బాధితురాలిని కొట్టడం, హింసించడం ప్రారంభించాడు.
తన కుటుంబం, ఆస్తులను కాపాడేందుకు తనకు కుమారుడు కావాలని చెబుతూ మహిళకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. 2009లో బాధితురాలు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2011లో మళ్లీ ఆమె గర్భవతి కావడంతో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఆపై బాధితురాలిపై వేధింపులు తీవ్రమయ్యాయి. బాధితురాలిని నిందితుడు బ్యాంకాక్‌కు తీసుకువెళ్లి జెనెటిక్ డయాగ్నసిస్ చేయించాడు. గర్భనిర్ధారణ పరీక్షలను దేశంలో నిషేధించడంతో విదేశాల్లో పరీక్షలు చేయించి ఆడబిడ్డ పుడుతుందని తెలుసుకుని ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. ఈ క్రమంలో బాధితురాలికి 1500కు పైగా హోర్మోన్, స్టెరాయిడ్ ఇంజక్షన్లను ఇప్పించాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abortion
- Crime news
- Mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

