మద్యం మత్తులో కుమారుడి పైశాచికత్వం.. చంపి పూడ్చిపెట్టిన తల్లి
మద్యం మత్తులో పైశాచికత్వం | వనపర్తి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుమారుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో నవమాసాలు మోసి పెంచిన తల్లే అతడిని కడతేర్చి ఇంట్లో పూడ్చిపెట్టింది.

మహబూబ్‌నగర్ : వనపర్తి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుమారుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో నవమాసాలు మోసి పెంచిన తల్లే అతడిని కడతేర్చి ఇంట్లో పూడ్చిపెట్టింది. కొత్తకోట మండలం రామకృష్ణాపురంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన హరిజన్ నాగమ్మ అనే మహిళకు ఇద్దరు కుమార్తె, కుమారుడు. కుమారుడు శివ (26) మద్యానికి బానిసై తరచూ నాగమ్మను వేదించేవాడు.
వారంక్రితం తాగి వచ్చి మద్యం మత్తులో తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడి ప్రవర్తనతో విసిగిపోయిన తల్లి తన తల్లి బుచ్చమ్మ సాయంతో మద్యం మత్తులో ఉన్న కుమారుడి గొంతు కోసి హతమార్చింది. ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. విషయం బయటకు రావడంతో సర్పంచ్‌తోపాటు స్థానికులు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

