దారుణం : లైంగిక దాడి బాధితురాలు బలవన్మరణం!

ఉదయ్‌పూర్ : దళిత బాలికను బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు నిందితుడు నేరాన్ని కెమెరాలో రికార్డు చేయడంతో బాధితురాలు బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈనెల 7న వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడిని కాపాడేందుకు దర్యాప్తు అధికారి ప్రయత్నిస్తున్నాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అక్టోబర్ 5న అభ్యంతరకర వీడియో వైరల్ కావడంతో 7న బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
ఈనెల 8న బాధితురాలి తండ్రి సైరా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా, 14న పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై బాలిక కుటుంబసభ్యులు ఐజీ, ఉదయ్‌పూర్ ఎస్పీకి లేఖ రాశారు. మరోవైపు ఉదయ్‌పూర్ ఎస్పీ కేసు పురోగతిపై వివరణ ఇస్తూ బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుపై నిందితుడిని అహ్మదాబాద్‌లో అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుడికి బాలికతో సంబంధం ఉందని, అతడి మొబైల్ ఫోన్ నుంచి ఫోటోగ్రాఫ్‌లు స్వాధీనం చేసుకున్నామని, బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

