బాలికపై తండ్రి స్నేహితుల సామూహిక అత్యాచారం..!
Girl was abused: మనిషి అన్నవాడు ఎవడైనా స్నేహితుడి కూతురు తనకూ కూతురు లాంటిదే అని భావిస్తాడు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో మానవత్వానికి, స్నేహానికి మచ్చతెచ్చే దారుణ ఘటన చోటుచేసుకుంది.

జబల్పూర్: మనిషి అన్నవాడు ఎవడైనా స్నేహితుడి కూతురు తనకూ కూతురు లాంటిదే అని భావిస్తాడు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో మానవత్వానికి, స్నేహానికి మచ్చతెచ్చే దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనారిటీ కూడా తీరని స్నేహితుడి కుమార్తెపై రెండు మానవమృగాలు అఘాయిత్యానికి ఒడిగట్టాయి. 11 ఏండ్ల బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో స్నేహితుడి ఇంట్లో చొరబడి ఆమెపై అత్యాచారం చేశారు.
జబల్పూర్ జిల్లాలోని రాంజీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఈ నెల 11న వెలుగుచూసింది. అఘాయిత్యాన్ని చూసిన పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాలిక ఇంటికి చేరుకుని ఆరా తీశారు. ఘటన జరిగినప్పటి నుంచి భయంతో వణికిపోతున్న బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి ఘటన గురించి ఆరా తీశారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో ఒకని వయసు 25 ఏండ్లు, మరొకని వయసు 26 ఏండ్లు ఉన్నదని జిల్లా అదనపు ఎస్పీ సంజయ్ అగర్వాల్ తెలిపారు. బాధితురాలు తండ్రితోపాటు నిందితులిద్దరూ కూలీలుగా పనిచేసేవారని, ఈ క్రమంలోనే తండ్రి లేని సమయం చూసి బాలికపై అఘాయిత్యం చేశారని తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abuse
- Girl
- Jabalpur
- Madyapradesh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

