![Minor girl raped by stepfather in mother's absence [Representative image]](https://imgk.timesnownews.com/story/iStock-1271658680_17_1.jpg?tr=w-600,h-450,fo-auto)
లక్నో : యూపీలో బాలికలు, మహిళలపై లైంగిక దాడులకు బ్రేక్ పడటం లేదు. 12 ఏండ్ల బాలికపై సవతి తండ్రి రెండేండ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన ఆదివారం మొరదాబాద్‌లో వెలుగుచూసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని (40) పోలీసులు అరెస్ట్ చేశారు.
తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలికపై తొలుత రెండేండ్ల కిందట నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బాలికను హెచ్చరించి పలుమార్లు దారుణానికి ఒడిగట్టాడు. రెండేండ్ల కిందట నిందితుడితో తనకు వివాహమైందని మైనర్ బాలిక, బాలుడిని ఇంటి వద్ద ఉంచి తాను పనులకు వెళ్లినప్పుడు ఈ ఘోరానికి తెగబడుతున్నాడని తెలిసిందని బాలిక తల్లి పేర్కొంది.
తాను పనిచేసే యజమాని ఈ విషయం చెప్పగా బాలికను నిలదీయడంతో జరిగిన దారుణం బయటపడిందని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికను బెదిరించి లైంగిక దాడులకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించారు. ఈ కేసులో సాక్షుల స్టేటెమెంట్ను రికార్డు చేశామని పోలీసులు తెలిపారు.