డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్ల బాధితులను పరామర్శించి.. మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసిన మేయర్!
మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి ప్రమాదాల వల్ల ఎవరో ఒకరిని కోల్పోయిన కుటుంబాలు ఉంటాయి. అలాంటి వారిని పరామర్శించి, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెప్పిందా మేయర్. ఆ తర్వాత కాసేపటికే ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతూ మరో యాక్సిడెంట్ చేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది.
రెడ్ల్యాండ్ సిటీ మేయర్ కారెన్ విలిమయ్స్.. డ్రంకెన్ డ్రైవింగ్ బాధిత కుటుంబాలను పరామర్శించింది. ఆ తర్వాత కాసేపటికి ఎక్కడికో వెళ్తూ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును కారుతో ఢీకొట్టేసింది. విషయం తెలిసి అక్కడకు వచ్చిన పోలీసులకు తాను కొన్ని గ్లాసుల వైన్ తాగినట్లు చెప్పింది. ఆ మత్తులోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, మేయర్‌పై ఎలాంటి కేసు ఇంకా పెట్టలేదని సమాచారం.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

