సుప్రీంకోర్టు ఎదుట నిప్పుపెట్టుకున్న పురుషుడు, మహిళ

న్యూఢిల్లీ: ఒక పురుషుడు, మహిళ సుప్రీంకోర్టు ఎదుట నిప్పుపెట్టుకున్నారు. గమనించిన అక్కడున్న వారు, పోలీసులు మంటలను ఆర్పివేశారు. కాలిన గాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలోని గేట్ డి వద్ద సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ ఘటన జరిగింది. ఒక పురుషుడు, మహిళ తమ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. రాజుకున్న మంటలతో సుప్రీంకోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది.
గమనించిన అక్కడున్న వారు వెంటనే వారిపై నీళ్లు పోసి మంటలు ఆర్పారు. మంటలకు తీవ్రంగా కాలిన మహిళ ఆ వెంటనే కింద పడిపోయింది. ఆమె వెంట ఉన్న మగ వ్యక్తి కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. వెంటనే వారిద్దరిని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే వారిద్దరు ఎవరు, ఎందుకు నిప్పు పెట్టుకుని ఆత్మహత్యకు యత్నించారు అన్నది తెలియలేదు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

