మొబైల్ ఫోన్ పాస్వర్డ్ చెప్పనందుకు ఫ్రెండ్‌ను హత్య

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ పాస్వర్డ్ చెప్పనందుకు ఒక వ్యక్తి తన స్నేహితుడి గొంతునొక్కి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. వాయువ్య ఢిల్లీలోని పిటాంపురా ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల మయాంక్ సింగ్, బీబీఏ చదువుతున్నాడు. ఈ సెల 21న 12వ తరగతి చదివే స్నేహితుడితో కలిసి స్థానిక పార్క్‌కు వెళ్లాడు. మొబైల్ ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని అడగ్గా అతడు నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో స్నేహితుడ్ని మయాంక్ సింగ్ రాయితో కొట్టాడు. అంతటితో ఆగక క్లాత్‌తో గొంతునులిమి హత్య చేశాడు. పార్క్‌లోని ఒక చోట మృతదేహం పడేశాడు. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని తన స్నేహితుల ఊరికి వెళ్లాడు.
మరోవైపు ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు తిరిగి రాకపోవడంతో 12వ తరగతి విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ నెల 25న పార్క్‌లో కుళ్లిన మృతదేహాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. పెద్ద టెడ్డీ బేర్తోపాటు డ్రగ్స్ కూడా అక్కడ లభించాయి.
ఈ ప్రాంతంలోని సీసీటీవీల ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు మయాంక్ సింగ్ తన స్నేహితుడితో కలిసి పార్క్‌కు వచ్చినట్లు గుర్తించారు. అతడి గురించి ఆరా తీయగా యూపీలోని గ్రామానికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో పిల్ఖువా ప్రాంతానికి వెళ్లి అతడ్ని అరెస్ట్ చేశారు. హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

