బెంగళూర్ : వివాహేతర సంబంధం విషయం తన భార్యకు తెలిపిందనే అక్కసుతో కదులుతున్న బస్సులో ప్రియురాలిపై దాడి చేసిన ఘటన కర్నాటకలోని బెలగావి జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివాహితుడైన నిందితుడు ప్రవీణ్‌కు వందనతో వివాహేతర సంబంధం ఉంది. వందన ఇటీవల ప్రవీణ్ భార్యతో తమ వివాహేతర సంబంధం విషయం వెల్లడించింది.
దీంతో వందనపై కోపం పెంచుకున్న ప్రవీణ్ కదులుతున్న బస్సులో వందనపై దాడి చేసి కత్తిపోట్లకు గురిచేశాడు. తోటి ప్రయాణీకులు అడ్డగించగా వారిని బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రవీణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వందనను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.