హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. కార్వాన్కు చెందిన మనోజ్(25) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని బాధిత యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడిపై దాడి చేసిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.