Haryana | కెనడా నుంచి రప్పించి మరీ.. ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
Haryana | హరియాణా (Haryana)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని విదేశాల నుంచి రప్పించి మరీ హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన గతేడాది జరగ్గా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Haryana | హరియాణా (Haryana)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని విదేశాల నుంచి రప్పించి మరీ హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన గతేడాది జరగ్గా ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రోహ్తక్ (Rohtak) ప్రాంతంలోని బాలంద్ గ్రామానికి చెందిన మోనిక (23) (Monika) ఐఇఎల్టీఎస్ శిక్షణ (IELTS Coaching) కోసం సోనిపత్ (Sonipat) ప్రాంతంలోని గుమాడ్ గ్రామంలో గల మేనత్త ఇంటికి వెళ్లింది. అప్పుడు అదే గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా కొన్నాళ్లకు ప్రేమకు దారి తీసింది. అయితే సునీల్‌కు అప్పటికే పెండ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం మోనికకు తెలుసు. ఇదిలా ఉండగా కొన్నాళ్లకు మోనిక పైచదువుల కోసం కెనడా వెళ్లింది.
కొన్ని రోజులు గడిచాకా.. జనవరి 2022న మోనికకు సునీల్ ఫోన్ చేసిన భారత్‌కు రావాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ క్రమంలో సునీల్‌ను కలిసేందుకు మోనిక ఇంటి నుంచి వెళ్లింది. అయితే ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గనౌర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మోనికను తన ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లిన సునీల్.. అక్కడ మద్యం మత్తులో ఆమెను హతమార్చినట్లు పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని ఫామ్‌హౌస్‌లోనే పాతిపెట్టినట్లు చెప్పాడు. దీంతో నిందితుడు సునీల్‌ను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మోనికను ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read..
UAE | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం.. యూఏఈ కోర్టు తీర్పు
Twitter Logo | మరోసారి మారిన ట్విట్టర్ లోగో.. మూడు రోజుల తర్వాత సొంతగూటికి చేరిన పిట్ట..!
Girl Swallows Phone | సోదరుడితో గొడవ.. సెల్‌ఫోన్ మింగేసిన యువతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Canada
- girlfriend
- haryana
- Sonipat
RELATED ARTICLES
తాజా వార్తలు
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

