Watch: షాపు బయట గన్‌తో వ్యక్తి కాల్పులు… ఓనర్‌ను డబ్బుల కోసం బెదిరింపు
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ దుకాణం వద్దకు వచ్చి ఆరా తీశారు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో ఫుటేజ్‌ను పరిశీలించారు.
న్యూఢిల్లీ: షాపు బయట గన్‌తో ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆ షాపు ఓనర్‌ను డబ్బుల కోసం బెదిరించాడు. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు ఈ సంఘటన జరిగింది. బవానా పోలీస్ స్టేషన్ సమీపంలోని దరీపూర్ ప్రాంతంలో ఉన్న ఒక పచారీ షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. ముసుగు ధరించిన ఒక వ్యక్తి తన చేతిలోని తుపాకీతో గాల్లోకి పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం ఆ షాపులోకి వెళ్లాడు. ఆ ఓనర్‌ను రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. కొంత సేపటి తర్వాత ఆ షాపు నుంచి వారిద్దరూ వెళ్లిపోయారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ దుకాణం వద్దకు వచ్చి ఆరా తీశారు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ షాపు ఓనర్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేందుకు ఆ వ్యక్తి గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ యువకులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఆ షాపు సమీపంలో సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: Man Fires Shots Outside Delhi Showroom On Extortion Visit https://t.co/a5PmLN9sOC pic.twitter.com/2s5BphSRr7
— NDTV (@ndtv) October 9, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

