ప్రముఖ బ్రాండ్ పేరుతో కల్తీ టీ పౌడర్ అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ : రెడ్ లేబుల్ టీ పౌడర్ బ్రాండ్‌తో కల్తీ టీ పౌడర్ అమ్ముతున్న వ్యక్తిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శనివారం అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 10 బ్యాగుల టీ పౌడర్, రెండు మొబైల్ ఫోన్లు మొత్తం రూ.1.4 లక్షల విలువైన సామానును స్వాధీనం చేసుకున్నారు. కల్తీపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నగరంలోని గౌలిగూడలో రైడ్ చేసి రాజస్థాన్ నివాసి మహేందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌కే చెందిన సురేందర్ అనే వ్యక్తి నుండి మహేందర్ టీ పౌడర్‌ను కొనుగోలు చేస్తూ లోకల్ నెట్వర్క్ ద్వారా మార్కెట్‌కు సరఫరా చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి నకిలీ టీ పౌడర్‌ను తెప్పించి స్థానికంగా అమ్ముతూ భారీ లాభాలను ఆర్జిస్తున్నట్లు డీసీపీ టాస్క్‌ఫోర్స్ గుమ్మి చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేందర్ ఆచూకీకి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం మహేందర్‌ను, స్వాధీనం చేసుకున్న వస్తువులను అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

