చండీఘఢ్ : పంజాబ్‌లోని లుధియానాలో దారుణం జరిగింది. ప్రియురాలి మైనర్ కూతురిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడిని షెర్పూర్కు చెందిన విశాల్ కుమార్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూలి పనులు చేసుకునే బాలిక తల్లి రెండేండ్ల నుంచి విశాల్ కుమార్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. కొద్దినెలలుగా పనీపాట లేకుండా తిరుగుతున్న విశాల్ ప్రియురాలి మైనర్ కూతురిపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
సోమవారం విశాల్ బాలికపై దారుణానికి ఒడిగట్టడంతో మహిళ నిలదీయగా ఆమెతో ఘర్షణకు దిగి పారిపోయాడు. మహిళ ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.