Road Accident | పాఠశాల బస్సును ఢీ కొట్టిన లారీ ..15 మంది విద్యార్థులకు గాయాలు.. లారీ క్లీనర్ మృతి
Road Accident | నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంతో 15 మంది పాఠశాల విద్యార్థులు గాయపడగా లారీ క్లీనర్మృతి చెందాడు.
అమరావతి : నెల్లూరు (Minister Nara Lokesh) జిల్లా కావలి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంతో 15 మంది పాఠశాల విద్యార్థులు గాయపడగా లారీ క్లీనర్ (Lorry Cleaner) మృతి చెందాడు. టోల్‌ప్లాజా వద్ద స్కూల్ బస్సును వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తాపడి 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో లారీ క్లీనర్ మృతి చెందాడు.
గాయపడ్డ విద్యార్థులకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 36 మంది వరకు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డికి చెందిన పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా డివైడర్ ఏర్పాటు చేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి లోకేష్
కావలి సమీపంలో పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్లో ఉంచుకోవాలని సూచించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

