e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News యూపీ కోర్టులో న్యాయవాదిపై కాల్పులు జరిపి హత్య

యూపీ కోర్టులో న్యాయవాదిపై కాల్పులు జరిపి హత్య

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని జిల్లా కోర్టులో ఒక న్యాయవాదిపై కాల్పులు జరిపి హత్య చేశారు. షాజహాన్‌పూర్‌ జిల్లా కోర్టులో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. న్యాయవాది భూపేంద్ర సింగ్‌ కోర్టు కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఇంతలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. అనంతరం ఆ న్యాయవాది కిందపడి రక్తం మడుగుల్లో చనిపోయి ఉన్నాడు. మృతదేహం సమీపంలో నాటు తుపాకీని గుర్తించారు.

న్యాయ­వాది భూపేంద్ర సింగ్‌ను మరో న్యాయవాది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య పాత గొడవ దీనికి కారణమని చెప్పారు. ఫోరె­న్సిక్ బృందం సంఘ­టనా స్థలా­నికి చేరి ఆధా­రాలు సేక­రిం­చిం­దని, నిందితుడైన మరో న్యాయవాదిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తు­న్నట్లు పోలీ­సులు వెల్లడించారు. కాగా, భూపేంద్ర సింగ్‌ గతంలో బ్యాంకులో పని చేశారని, గత నాలుగైదు ఏండ్ల నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారని తోటి న్యాయవాది ఒకరు తెలిపారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement