జార్ఖండ్ ముఠా సైబర్ మోసం.. నారాయణపేట జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్ ఖాతా!!
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సామాన్యుల వివరాలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి వారి సంబంధీకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ మోసగాడు ఏకంగా జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించాడు. గుర్తు తెలియని వ్యక్తి 8210616845 నంబర్‌తో నారాయణపేట జిల్లా కలెక్టర్ డీ హరిచందన ఫోటోతో వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించాడు. దాన్నుంచి పలువురు ఉన్నతాధికారులు, ఇతరులకు సందేశాలు కూడా పంపించాడు.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సామాన్యుల వివరాలతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి వారి సంబంధీకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ మోసగాడు ఏకంగా జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించాడు. గుర్తు తెలియని వ్యక్తి 8210616845 నంబర్‌తో నారాయణపేట జిల్లా కలెక్టర్ డీ హరిచందన ఫోటోతో వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించాడు. దాన్నుంచి పలువురు ఉన్నతాధికారులు, ఇతరులకు సందేశాలు కూడా పంపించాడు.
వీరి వలలో పడ్డ జిల్లా స్థాయి మాజీ అధికారి.. అమెజాన్ పే యాప్‌నుంచి రూ. 2,40,000 పంపించారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు..వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశామని దీనిపై విచారణ చేస్తున్నట్లు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నకిలీ వాట్సాప్ నంబర్‌తో నారాయణపేట జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని, దాని నుంచి వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. దీనినుంచి ఎవరికైనా సందేశాలు వస్తే పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు.
కలెక్టర్ ఫోటోతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి డబ్బులు డ్రా చేసిన వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, ఈ విషయంపై విచారణ జరుగుతుందని ఎస్పీ తెలిపారు. అలాగే, ఇలాంటి వాట్సాప్ సందేశాలు వచ్చినా, ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ మార్చి ఉన్నతాధికారుల ఫోటోలు పెట్టి డబ్బులు కావాలని అడిగినా నమ్మొద్దని, ఒకసారి విచారణ చేసుకోవాలని సూచించారు. ప్రజలు వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా మెసేజ్‌లకు స్పందించి డబ్బులు వేయకూడదని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎవరైనా అడిగితే వెంటనే వారి వివరాలను పోలీసులకు అందజేయాలని సూచించారు. సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే, సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేందుకు ఎన్సీఆర్పీ పోర్టల్ లో కంప్లైంట్ చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

