లక్నో : తన స్నేహితురాలితో మాట్లాడుతున్నాడనే కోపంతో లా స్టూడెంట్ తన క్లాస్‌మేట్‌ను కత్తితో పొడిచిన ఘటన లక్నోలో కలకలం రేపింది. యూనివర్సిటీ ఆఫ్ లక్నోలో ఈ ఘటన జరిగింది. లా స్టూడెంట్ అయిన నిందితుడు సుదాన్షు సహ విద్యార్ధినితో మాట్లాడుతుండేవాడు. విద్యార్ధిని ఇటీవల సుధాన్షును దూరం పెట్టి చంద్రభూషణ్ అనే మరో క్లాస్‌మేట్‌తో స్నేహంగా మెలుగుతోంది.
చంద్రభూషణ్‌తో తన గర్ల్‌ఫ్రెండ్ చనువుగా ఉండటాన్ని జీర్ణం చేసుకోలేని సుధాన్షు క్లాస్‌రూంలోనే అతడిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన చంద్రభూషణ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు. ట్రయాంగిల్ లవ్ వ్యవహారమే కత్తిపోట్లకు దారితీసిందని భావిస్తున్నారు.