క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ కాలేదని ఇంజనీరింగ్ విద్యార్ధిని బలవన్మరణం
ఉద్యోగం రాలేదని మనస్ధాపంతో 21 ఏండ్ల విద్యార్ధిని నోయిడాలోని సెక్టార్ 56లోని హోటల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడింది.
న్యూఢిల్లీ : ఉద్యోగం రాలేదని మనస్ధాపంతో 21 ఏండ్ల విద్యార్ధిని నోయిడాలోని సెక్టార్ 56లోని హోటల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ పైనల్ ఇయర్ చదువుతున్న యువతి బుధవారం రాత్రి హోటల్ రూంలో ఉరివేసుకుని విగతజీవిగా మారడం కలకలం రేపింది. తల్లితండ్రులు తనపై పెట్టుకున్న ఆశలను తాను నెరవేర్చలేకపోతున్నానని అక్కడ లభ్యమైన సూసైడ్ నోట్లో బాధితురాలు రాసుకొచ్చింది.
క్యాంపస్ ప్లేస్మెంట్లో విఫలం కావడంతోనే విద్యార్ధిని తీవ్ర నిర్ణయం తీసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు అర్జెంట్ పనిఉందని చెప్పి యువతి ఇంటి నుంచి బయటకు రాగా, సాయంత్రం ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమె ఫోన్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టి నోయిడాలోని హోటల్ రూంలో ఉన్నట్టు గుర్తించారు. లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో మాస్టర్ కీ సాయంతో తలుపు తెరిచిన పోలీసులకు విగతజీవిలా కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- engineering
- Student
- suiciede
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

