కోల్కతా : పశ్చిమ బెంగాల్లో దారుణం వెలుగుచూసింది. కట్టుకున్న భార్యపై భర్తతో పాటు అతడి స్నేహితులు ఇద్దరు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం కలకలం రేపింది. చికిత్స కోసం బిహార్లోని నెవాడ నుంచి కోల్కతాకు వచ్చిన మహిళపై భర్త ప్రోద్బలంతో సామూహిక లైంగిక దాడి జరిగింది.
భర్త సహా నిందితులపై మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటకువచ్చింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ఇంట్లో మార్చి 3న పార్టీ జరిగిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాసిపోర్ రోడ్డు ప్రాంతంలోని ఆంటీ ఇంట్లో మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. నిందితుడితో బాధితురాలికి రెండేండ్ల కిందట వివాహం జరిగింది. పధకం ప్రకారం భర్తతో పాటు ఇద్దరు స్నేహితులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు.