కోహ్లీ కుమార్తెపై అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులు.. హైదరాబాదీని అరెస్టు చేసిన పోలీసులు
Rape Threats to Kohli Daughter | టీ20 ప్రపంచకప్‌లో భారత తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లపై ఆన్లైన్లో విపరీతమైన విద్వేష వ్యాఖ్యలు

Rape Threats to Kohli Daughter | టీ20 ప్రపంచకప్‌లో భారత తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లపై ఆన్లైన్లో విపరీతమైన విద్వేష వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో టీమిండియా సారధి విరాట్ కోహ్లీకి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
విరాట్, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జంటకు పుట్టిన 9 నెలల పాప వామికపై అత్యాచారం చేస్తానంటూ ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ బెదిరింపులపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఈ బెదిరింపులపై తీసుకున్న చర్యలను వివరించాలని ఢిల్లీ పోలీసులను కోరింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కుమార్తెపై అత్యాచార బెదిరింపులకు పాల్పడి హైదరబాదీ వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రామ్‌నగేష్ శ్రీనివాస్ ఆకుబతిని అనే 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్డు చేసి ముంబై తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రామ్‌నగేష్ గతంలో ఒక డెలివరీ యాప్‌లో కూడా పనిచేసినట్లు సమాచారం.
పాక్ చేతిలో ఓటమి తర్వాత టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై మతపరమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియా మార్కోగిన విషయం తెలిసిందే. అతన్ని దేశద్రోహి అంటూ కొందరు నిందించారు. ఇలాంటి సమయంలో షమీకి కోహ్లీ అండగా నిలబడ్డాడు. ఆ తర్వాత కోహ్లీపై కూడా ఆన్లైన్ ట్రోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

