విజయవాడ కంపెనీ కంటైనర్లలో డ్రగ్స్.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి దిగుమతి !
Heroin Seized : గుజరాత్ తీరంలో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.9,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. టాల్కం పౌడర్ పేరుతో...

అహ్మదాబాద్ : గుజరాత్ తీరంలో పెద్ద ఎత్తున హెరాయిన్ (Heroin Seized) పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.9,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. టాల్కం పౌడర్ పేరుతో మత్తు మందులను దిగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఈ హెరాయిన్‌ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంటైనర్ల ద్వారా భారతదేశానికి చేరవేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. ముంద్రా పోర్టుకు వచ్చిన కంటైనర్లలో హెరాయిన్ సరఫరా అవుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక కంటైనర్ నిండా హెరాయిన్ వచ్చినట్లు గుర్తించారు. ఈ హెరాయిన్ కంటైనర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినట్లు తెలుస్తున్నది. తదుపరి విచారణ కోసం అధికారులు సరుకును స్వాధీనం చేసుకున్నారు. టాల్కం పౌడర్ ముసుగులో కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి అవుతున్నట్లు డీఆర్ఐ అధికారులు కనుగొన్నట్లు తెలుస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్న ఆషి ట్రేడింగ్ సంస్థ ఈ కంటైనర్లను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సరుకును టాల్కం పౌడర్‌ను సంస్థ ప్రకటించినట్లు అధికారులు చెప్తున్నారు. ఎగుమతి సంస్థ హసన్ హుస్సేన్ లిమిటెడ్‌గా గుర్తించారు. ఐదు రోజులుగా డీఆర్ఐ అధికారులతోపాటు కస్టమ్స్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి చివరకు భారీ ఎత్తున దిగుమతి అయిన డ్రగ్స్‌ను పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మహిళ చేతిలో పోలీసు నిలువుదోపిడి.. ఎలాగంటే..?
ఒకవైపు తాలిబాన్‌పై ప్రశంసలు.. మరోవైపు బైడెన్‌కు మద్దతు
ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి కేకలు.. తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న ప్రజలు
పేదల కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ పెంచాలి: గడ్కరీ
బ్రిటన్ చిన్నారుల్లో కరోనా వ్యాప్తి
119 అశ్లీల చిత్రాలను నిర్మించి.. 9 కోట్లకు అమ్మాలనుకున్నాడు
ముగిసిన కోవింద్ సిమ్లా పర్యటన
సింధు జల ఒప్పందానికి 61 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

