ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి కేకలు.. తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న ప్రజలు
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌లో పేదరికం అక్కడి ప్రజలతో ఆటలాడుకుంటున్నది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారం కోసం ఇంట్లో ఉన్న వస్తువులను...

Afghanistan crisis | ఆఫ్ఘనిస్తాన్‌లో పేదరికం అక్కడి ప్రజలతో ఆటలాడుకుంటున్నది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారం కోసం ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మకానికి పెడుతున్నారు. కండ్ల ముందే చిన్నారులు ఆకలి కోసం ఏడుస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పెద్దవాళ్లు ఉంటున్నారు. ఏదైనా పనిచేసి సంపాదిద్దాం అనుకుంటే ఏమీ పనులు దొరకడం లేదని పలువురు కన్నీరు పెట్టుకుంటున్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడం, ప్రజల వద్ద డబ్బు లేకపోవడంతో ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి.
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ పౌరులు జీవించడం చాలా కష్టంగా మారింది. నగదు కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ప్రజలు రెండు పూటలు భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆకలిని నివారించేందుకు ప్రజలు వారి ఇండ్లల్లోని విలువైన వస్తువులను విక్రయిస్తున్నారు. పలువురు రోడ్లపై తమ ఇంటి వస్తువులను అమ్మకానికి పెట్టిన తీరు అక్కడి పేదరికాన్ని స్పష్టం చేస్తున్నది. కార్బెట్‌లోని చమన్-ఇ-హోజోరి పార్కుకు వెళ్లే రహదారిపై తివాచీలు, ఫ్రిజ్, టెలివిజన్, సోఫాలతో పాటు అనేక గృహోపకరణాలు అమ్మకానికి పెట్టారు. ప్రజలు తమ కుటుంబాల కోసం రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి తాగునీటిని కూడా విక్రయిస్తున్నారు.
25 వేల ఫ్రిజ్ 5 వేలకే..
ఇంట్లో వారి ఆకలి తీర్చేందుకు రూ.25 వేల విలువైన ఫ్రీజ్ను రూ.5 వేలకు అమ్మకానికి పెట్టానని లాల్ గుల్ అనే వృద్ధుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పిల్లల కడుపు నింపేందుకు ఇలా కాకుండా తన వద్ద మరో మార్గం లేదని ఆయన చెప్తున్నారు. కొందరు ఆకలి కోసం ఇంటి వస్తువులను అమ్మకానికి పెట్టగా.. మరికొందరేమో ఆఫ్ఘన్ వదిలివెళ్లేందుకు కావాల్సిన డబ్బు కోసం వస్తువులను అమ్ముతున్నారు. నేను, నా కుమారుడు ఇద్దరం నిరుద్యోగులం. తినడానికి డబ్బు కోసం వస్తువులను అమ్మకానికి ఉంచాం అని కాబూల్ నివాసి ఒకరు తన గోడు వెళ్లబోసుకున్నాడు. జీతం లేకపోవడంతో గత 10 రోజులుగా మార్కెట్లో పనిచేస్తున్నానని పోలీస్ అధికారి మహమ్మద్ ఆఘా చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పేదల కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ పెంచాలి: గడ్కరీ
119 అశ్లీల చిత్రాలను నిర్మించి.. 9 కోట్లకు అమ్మాలనుకున్నాడు
ప్రధానికి మహిళా క్రీడాకారులు ఇచ్చిన బహుమతులు వేలానికి..
కండ్లు మసకబారుతున్నాయా? అయితే ఈ వ్యాధి కావచ్చు..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

