అహ్మదాబాద్: ఒక బాలుడ్ని పలుమార్లు చెంపపై కొట్టిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. గుజరాత్‌లోని వడోదరలో ఈ ఘటన జరిగింది. శక్తిసిన్హ పర్వ్ అనే పోలీస్ అధికారి శనివారం రాత్రి 8.45 గంటలకు తన వాహనంలో మరో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. నందేసరి మార్కెట్ వద్దకు రాగా 13 ఏండ్ల బాలుడు రోడ్డును దాటుతూ ఆ పోలీస్‌ను చూసి గొణుగుతూ ఏదో అన్నాడు. దీంతో శక్తిసిన్హ పర్వ్ ఆగ్రహంతో వెంటనే వాహనం ఆపి కిందకు దిగాడు. ఆ బాలుడ్ని పట్టుకుని అతడి చెంపపై చాలాసార్లు కొట్టాడు. అతడి చేతిని మెలితిప్పాడు.
కాగా, అక్కడ ఉన్న సీసీటీవీలో ఇది రికార్డైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జోన్ 1 డీసీపీ స్పందించారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపారు. బాలుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారి శక్తిసిన్హ పర్వ్‌ను సస్పెండ్ చేశారు. ఛని పోలీస్ స్టేషన్‌కు ఆయనను అటాచ్ చేశారు.