Woman Harass | నీ భార్యను మాకు ఇచ్చేయ్.. లేదంటే చంపేస్తామని బెదిరింపులు.. యూపీలో ఘటన
Woman Harass | లక్నో : నీ భార్య నీకు సరిపోదు.. మాకైతే ఓకే.. ఒక వేళ నీ భార్యను మాకు అప్పగించకపోతే, చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందాలో వెలుగు చూసింది.
Woman Harass | లక్నో : నీ భార్య నీకు సరిపోదు.. మాకైతే ఓకే.. ఒక వేళ నీ భార్యను మాకు అప్పగించకపోతే, చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బందా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవలే ఓ ఇద్దరు వ్యక్తులు పీకల దాకా తాగొచ్చి, ఆ వ్యక్తితో గొడవకు దిగారు. ఆ వ్యక్తి భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించి, ఫోటోలు తీసేందుకు యత్నించారు. దీంతో భర్త కల్పించుకుని అడ్డుకున్నాడు. నీకు నీ భార్య సరిపోదు. తమకైతే సరిపోతుందని అసభ్యంగా మాట్లాడారు. ఆమెను తమకు అప్పగించకపోతే నిన్ను, నీ పిల్లలను చంపేస్తామని దుండగులు బెదిరింపులకు గురి చేశారు.
తన కుటుంబాన్ని దుండగుల నుంచి కాపాడుకోవాలనే ఉద్దేశంతో.. బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్దల ఒత్తిడి కారణంగా పోలీసులు మొదట్లో కేసు నమోదు చేయలేదు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జసోలా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేసిన ఆ ఇద్దరు దుండగులను కఠినంగా శిక్షించాలని బాధిత వ్యక్తి డిమాండ్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

