కుక్క పిల్లతోపాటు.. 9వ అంతస్తు నుంచి పడి బాలిక మృతి

లక్నో: కుక్క పిల్లను కాపాడబోయిన 12 ఏండ్ల బాలిక, దానితోపాటు 9వ అంతస్తు పైనుంచి పడి మరణించింది. ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. గౌర్ హోమ్స్ హౌసింగ్ సొసైటీ 9వ అంతస్తులోని అపార్ట్మెంట్లో ఉంటున్న జ్యోత్న ఏడవ తరగతి చదువుతున్నది. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో కుక్క పిల్లతో ఆడుకుంటున్నది. ఈ క్రమంలో బాల్కానీకి ఏర్పాటు చేసిన నెట్లో అది చిక్కుకున్నది.
కాగా, కుక్క పిల్లను నెట్ నుంచి తీసేందుకు ప్రయత్నించిన జ్యోత్స అదుపు తప్పి దానితో సహా బాల్కానీ నుంచి కిందపడింది. గమనించిన తల్లి హడావుడిగా కిందకు వచ్చి చూడగా ఆమె కూతురు, కుక్క పిల్ల రక్తం మడుగుల్లో పడి ఉన్నారు. బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఆ కుక్క పిల్ల కూడా చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

