Gas cylinder blast | నానక్‌రామ్‌గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు..11 మందికి గాయాలు

శేరిలింగంపల్లి : హైదరాబాద్ నానాక్‌రామ్‌గూడలో మంగళవారం ఉదయం వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది.
సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్ధానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక గ్యాస్ సిలిండర్ కు మూడు కనెక్షన్స్ ఇవ్వటం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 50 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఉత్తరాది నుంచి వచ్చి హైదరాబాద్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. వారు వాడుతున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కు సురక్షితమైన పైపు కాకుండా సాధారణమైన పైపు అమర్చినట్లు గుర్తించారు.
టీ-జాయింట్ కనెక్టర్ వాడి రెండు పొయ్యిలను వాడుతున్నారు. ఆ గ్యాస్ పొయ్యిలకు నాబ్స్ కూడా లేనట్టు గుర్తించారు. ప్రమాదం జరిగిన రూమ్ లో రెండు సిలిండర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి బ్లాస్ట్ అయినట్లు తెలిసింది.పేలుడుఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సుల్తాన్‌బజార్ : నానక్‌రామ్‌గూడలో మంగళవారం తెల్లవారుమున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు క్షతగాత్రులను ఉస్మానియా దవాఖానకు వైద్య చికిత్సల నిమిత్తం తరలించారు.ఈ ఘటనలో గాయపడిన సునీల్ (24), ఎండీ రిజ్వాన్ (24), ఎండీ పర్వేజ్ (22), ఎండీ అఫ్సర్ (21) లు దవాఖాన క్యాజువాల్టీకి తీసుకురాగా ప్రథమ చికిత్స చేసిన నలుగురు క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

