విష వాయువు పీల్చడంతో నలుగురు మృతి
చండీగఢ్ : హర్యానాలోని బహదూర్‌ఘర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. రోహాద్ ఫ్యాక్టరీ ప్రాంతంలో విష వాయువు కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతులంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఫ్యాక్టరీలోని ఓ రసాయన నీటిని నిల్వ చేసిన ట్యాంకులోకి శుభ్రం చేసేందుకు నలుగురు దిగగా.. విషయ వాయువులను పీల్చడంతో మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రోహద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో గ్యాస్కెట్ పేపర్ తయారవుతోంది. ఇందు కోసం రకరకాల రసాయనాలను ఉపయోగిస్తుంటారు.
రసాయనాల వ్యర్థ జలాలు ఫ్యాక్టరీ వెనుక దాదాపు ఐదు అడుగుల లోతులో ట్యాంకులాంటి ప్రాంతంలోకి వెళ్తాయి. అది నిండిన తర్వాత ట్రాక్టర్ సహాయంతో తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ట్యాంక్ నిండగా.. వ్యర్థాలు పేరుకుపోయాయి. వాటిని తొలగించేందుకు ఓ కార్మికుడు ఇందులోకి దిగగా.. వెంటనే స్పృహ కోల్పోయాడు. అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు మరో కార్మికుడు అందులోకి దిగగా స్పృహ కోల్పోయాడు. ఇలా కార్మికులు ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు వెళ్లి విషయ వాయువులు పీల్చి స్పృహ తప్పపడిపోయారు. వారందరినీ బయటకు తీయగా.. నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకొని, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కలెక్టర్ విచారణ కోసం కమిటీని నియమించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

